గన్నవరం మెట్ట వద్ద రోడ్డుపై వరద ఉధృతితో వాహనాల రాకపోకలు బంద్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
నాతవరం మండలంలో గన్నవరం మెట్ట వద్ద ఆర్ అండ్ బి రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ట్రాఫిక్‌ను మరో మూడు గంటల పాటు నిలిపివేశారు. ఆర్ అండ్ బి ఈఈ విద్యాసాగర్, సీఐ రేవతమ్మ తదితరులు పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పోలీసులు అందించిన హెచ్చరికలను పాటిస్తూ ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.