ది ప్యారడైజ్ సినిమాలో నటనపై ప్రియదర్శిని ప్రశంసించిన హరీశ్ రావు

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

ది ప్యారడైజ్ చిత్రంలో నటుడు ప్రియదర్శి నటన అద్భుతంగా ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. తన నివాసంలో హరీశ్ రావును ప్రియదర్శి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమాలో శంకరన్న పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయిన తీరును హరీశ్ రావు కొనియాడారు. కేసీఆర్ హావభావాలను ప్రియదర్శి ఎంతో సహజంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.