ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపం వెలిగించాలని పురందేశ్వరి పిలుపు
రిపోర్టర్: శివ
స్థలం: Andhra Pradesh
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఆశీర్వాద దీపం వెలిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆమె కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ సాయంత్రం దీపాలు వెలిగించి కృతజ్ఞతాపూర్వక ఆశీర్వాదాలు అందించాలని కోరారు.