ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం: అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవచ్చని వారు పేర్కొన్నారు. చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్ లోని వివిధ మండలాల్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్ లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.