కూకట్పల్లిలో ఏక్తాయాత్ర: సర్దార్ పటేల్ ఆశయాలను చాటిన ఎంపీ ఈటెల రాజేందర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

కూకట్పల్లి నియోజకవర్గంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఏక్తాయాత్రలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు మనిషి పటేల్ కృషితోనే దేశం ఐక్యంగా ఉందన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ జాతీయ జెండాతో విద్యార్థులు, యువత ప్రదర్శన నిర్వహించారు.