రాప్తాడు ఘటనపై వైఎస్ జగన్ ఫైర్: యాభై లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: రాప్తాడు

రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారని వై పార్టీ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరులో చికిత్స పొందుతున్న బాధిత బాలికను పరామర్శించిన ఆయన, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.