పల్నాడులో పోలీసుల సోదాలు: భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వైనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భారీగా అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు పోలీస్ వెల్లడించారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఆకస్మిక సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.