పిఠాపురం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట: రూ.50 కోట్ల నిధులు విడుదల

రిపోర్టర్: శివ స్థలం: కాకినాడ

పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పాడా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందని ప్రణాళికా శాఖ అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో 14 ప్రభుత్వ విభాగాల పరిధిలో మొత్తం 182 అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.