ఫుట్బాల్ స్టార్ కైలియన్ ఎంబాపే వివాదం: చైనాలో స్పాన్సర్షిప్ ఒప్పందాలు రద్దు

రిపోర్టర్: సతీష్ స్థలం: Beijing

చైనా విప్లవ నేత మావో జెడాంగ్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఫ్రాన్స్ ఫుట్బాల్ స్టార్ కైలియన్ ఎంబాపే బేషరతుగా క్షమాపణలు తెలిపారుని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ వివాదం కారణంగా చైనాకు చెందిన పలు ప్రముఖ కంపెనీలు ఆయనతో కుదుర్చుకున్న వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. చైనా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా తన వ్యాఖ్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఎంబాపే ఈ మేరకు స్పందించారు.