సర్వేపల్లిలో రూ.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సోమిరెడ్డి శంకుస్థాపన

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో సుమారు రూ.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం 33 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు విద్యుత్ లైన్లు, హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించారు.