ఆల్తూరుపాడు టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కనుపూరు చిరంజీవి నామినేషన్ ఖరారు
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఆల్తూరుపాడు సెగ్మెంట్ టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కనుపూరు చిరంజీవిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మండలంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.