ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఈ ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్ లో భారీ వర్షాల కారణంగా ఎన్నికలను వాయిదా వేయగా, మిగిలిన స్థానాలకు లక్షలాది మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటూ క్యూలైన్లలో బారులు తీరారు.