తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
అర్నబ్ తుపాను ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నెల 28న బాపట్ల- విశాఖ మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు.