జగదీశ్‌రెడ్డి హత్య కేసు: నిందితుడు సాదిక్ ఖాన్ కస్టడీ విచారణ పూర్తి
రిపోర్టర్: రమేష్
స్థలం: కాకినాడ
కాకినాడకు చెందిన జగదీశ్‌రెడ్డి హత్య కేసులో నిందితుడు సాదిక్‌ఖాన్ పోలీసు కస్టడీ విచారణ ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య పూర్తిగా పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు విచారణలో తేలిందని, సైనేడ్, థాలియం సల్ఫైడ్ రసాయనాలను విడతలవారీగా ఉపయోగించి ప్రోటీన్ పౌడర్‌లో కలిపి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. కోర్టు అనుమతి ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం సాదిక్‌ఖాన్‌ను కాకినాడ కోర్టులో హాజరుపరచడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.