'హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలి': ట్యాంక్ బండ్ ఆంక్షలపై తీవ్ర ఉత్కంఠ

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాల వేళ హుస్సేన్‌సాగర్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో నిమజ్జనాలపై విధించిన ఆంక్షలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారం ట్యాంక్‌బండ్‌పై భారీ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు ప్రముఖ విగ్రహాల నిమజ్జనంపై సస్పెన్స్ నెలకొనగా, సాంప్రదాయం ప్రకారం హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని భక్తులు, నిర్వాహకులు భీష్మించుకుకూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.