ఓటీటీకి మోహన్‌లాల్ కూతురు విస్మయ డెబ్యూ మూవీ తుడక్కం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కూతురు విస్మయ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'తుడక్కం' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుంచి జియో హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు చిన్నారులను రక్షించేందుకు మార్షల్ ఆర్టిస్ట్ చేసే పోరాటం ఈ చిత్ర ప్రధాన కథాంశం.