ఇంద్రకీలాద్రిపై దసరా భద్రత: ఏఐ టెక్నాలజీతో నిఘా పర్యవేక్షిస్తున్న డీజీపీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తుల భద్రత కోసం కృత్రిమ మేధ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబుతో కలిసి ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్లు, ఏఎన్పీఆర్ కెమెరాల నిఘాతో పాటు క్యూలైన్లలో రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.