పులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ జగన్ పై కేసు నమోదు: తీవ్ర కలకలం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: పులివెందుల

పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మరో ది మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడంపై ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చడంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.