లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నారాయణపేట ఎస్‌ఆర్‌ఓ
రిపోర్టర్: రాము
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎస్‌ఆర్‌ఓ వెంకటస్వామి, నాగరాజు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం బాధితుడిని రూ.50 వేలు డిమాండ్ చేయగా, మిగిలిన మొత్తం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.