వైద్య సేవలకు భరోసానిస్తూ సాగుతున్న ప్రజా ప్రతినిధుల సంకల్పం

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ శిబిరాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు తక్షణ స్పందనగా ఆసుపత్రి అభివృద్ధికి పూర్తి హామీనిచ్చారు. ఎంపీ నిధులు, దాతల సహకారంతో పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.