తెలంగాణకు రెండు లక్షల ఇళ్ళు మంజూరు చేసిన కేంద్రం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దాదాపు రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసింది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి లబ్ధిదారునికి కేంద్ర సాయం కింద రూ.1.20 లక్షలు అందనుండగా, కుటుంబాలకు పెద్దపీఠ వేస్తూ కేంద్రం ఈ భారీ గృహ నిర్మాణ నిధులను కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.