మధుమేహ బాధితులకు గుడ్ న్యూస్: నాలుగు నిమిషాల వ్యాయామంతో షుగర్ అదుపు

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

రోజంతా గంటల తరబడి వ్యాయామం చేయలేకపోయినా రోజులో కేవలం నాలుగు నిమిషాలు వేగంగా చేసే వ్యాయామాలు టైప్ టు డయాబెటిస్ బాధితుల్ లో బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయని లేటెస్ట్ అధ్యయనం వెల్లడించింది. ప్రఖ్యాత మెడికల్ జర్నల్ డయాబెటాలజియా లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ఎక్సర్సైజ్ స్నాక్స్ గా పిలిచే చిన్నపాటి శరీర బరువు ఆధారిత వ్యాయామాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరుస్తాయని పరిశోధకులు స్పష్టం చేశారు.