'కొత్త పింఛన్ల గడువు పెంపు': సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తులకు అవకాశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 18 వరకు మరో రెండు రోజులు పొడిగించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా ఈ ప్రకటన చేయగా, సెలవులు తదితర కారణాలతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వృద్ధులు, వితంతువులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 పింఛన్ అందుతుండగా, గడువు ముగిశాక అధికారులు పరిశీలించి అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.