'సౌదీ ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చేశాం': యెమెన్ హౌతీల సంచలన ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: వరల్డ్

యెమెన్‌లోని మారిబ్ ప్రావిన్సులో సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని హౌతీ మిలిటెంట్లు కూల్చివేశారు. స్థానికంగా త‌యారు చేసిన ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్‌తో ఈ ఫైట‌ర్ జెట్‌ను నేలకూల్చిన‌ట్లు హౌతీ మిలిట‌రీ ప్ర‌తినిధి యాహ్యె సారే తెలిపారు. శ‌త్రు ఆప‌రేష‌న్స్ చేప‌డుతున్న స‌మ‌యంలో ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలతో కూడిన వీడియోను హౌతీలు విడుదల చేయగా, విమాన శిథిలాలు ఎడారి ప్రాంతంలో పడిపోయినట్లు గుర్తించారు.