జపాన్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు రనౌట్

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బౌండరీ లైన్ వద్ద నుంచి విసిరిన మెరుపు వేగపు త్రోతో అద్భుతమైన రనౌట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నేరుగా స్టంప్స్‌ను తాకిన ఈ త్రోతో ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇషాన్‌కిషన్ అసాధారణ ఫీల్డింగ్ ప్రతిభకు సంబంధించిన ఈ ఘటన మైదానంలో ప్రధాన ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.