టెట్ ఫలితాల్లో ప్రతిభ చాటిన మునగాల ఉపాధ్యాయుడు భరత్ బాబు
రిపోర్టర్: Bhradwaj
స్థలం: మునగాల
తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించిన ఇన్ సర్వీస్ టెట్ 2 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు విశేష ప్రతిభ చాటారు. పేపర్ 2 మాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 150 మార్కులకు గాను 101 మార్కులు సాధించి సత్తా చాటారు. 2002 డిఎస్సీ బ్యాచ్‌కు చెందిన భరత్ బాబు విజయం పట్ల పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారాని సహచరులు పేర్కొన్నారు.