యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి అష్టోత్తర శత ఘటాభిషేకం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శత ఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేపట్టారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.