పాల్వాయి గ్రామంలో గణనాథుని సన్నిధిలో సాహిత్ సాయి పుట్టినరోజు వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గుర్రంపోడు

గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలోని రామాలయంలో కొనసాగుతున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్ సాయి పుట్టినరోజు వేడుకలను గణనాథుని సన్నిధిలో జరిపించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి నిమ్మగడ్డ సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.