సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాల డిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసీ విశ్వసనీయతను ఆయన దిగజార్చారని ఆరోపిస్తూ, ఆయన్ను తక్షణమే సీఈసీ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా ఆదేశాలతోనే ఈసీ ఓటు చోరీకి పాల్పడుతోందని, రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి జరుగుతోందని విమర్శించారు.