కాలువలో జారిపడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

రిపోర్టర్: U.Srinivasarao స్థలం: కిర్లంపూడి

కిర్లంపూడి మండలం చిల్లంగి భావి చెరువు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కాలువలో జారి పడి చేవూరి నూకరాజు (43) అనే వ్యక్తి మృతి చెందాడు. ఏలేశ్వరం గ్రామానికి చెందిన నూకరాజు కిర్లంపూడిలో కాగితాలు, వాటర్ బాటిళ్లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో మూర్ఛవ్యాధి రావడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.