పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.5,912 కోట్లు కేటాయింపు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ రెండో విడతలో రూ.5,912 కోట్ల అంచనా వ్యయంతో 14 ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. మురుగునీరు, వరదనీటి కాలువలు, తాగునీరు, పార్కింగ్ వంటి వసతుల మెరుగుదలకు ఈ నిధులు వెచ్చించనున్నారు. కేంద్ర గ్రాంట్, మున్సిపల్ బాండ్లు, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.