అఫీషియల్: లూసిఫర్ 3 వస్తోంది.. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌కు పండగే!

రిపోర్టర్: సతీష్ స్థలం: Kerala

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన సంచలన చిత్రం 'లూసిఫర్'కు త్వరలోనే మూడో భాగం రానుంది. ఈ విషయాన్ని నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ అధికారికంగా ధృవీకరించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఎంపురాన్' తర్వాత రానున్న ఈ సీక్వెల్ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.