రాజకీయ సంచలనం: రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా ధ్వజం

రిపోర్టర్: సునీల్ స్థలం: ఢిల్లీ

ఇది బనానా రిపబ్లిక్ కాదు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి తలపెట్టిన భారీ బహిరంగ సభకు ముందు ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు అబద్ధాలు, వదంతులు ప్రచారం చేస్తూ దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని నడ్డా ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు ఈ నిరసన ప్రదర్శన చేపట్టినట్లు ప్రకటించాయి.