డేటింగ్ యాప్ పరిచయంతో పబ్‌కెళ్లి మోసపోయిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో డేటింగ్ యాప్ పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హేమంత్‌ను ఓ యువతి పబ్‌కు తీసుకెళ్లి భారీగా మోసగించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. క్వాక్ క్వాక్ యాప్ ద్వారా దివ్య అనే యువతితో పరిచయం ఏర్పడగా, ఆమె పబ్‌కు రమ్మని పిలిచిందని చెప్పారు. అక్కడ ఒక్క బీర్ తాగాక రూ.29,884 బిల్లు వేశారని, ప్రశ్నించిన బౌన్సర్లు బెదిరించారని, యువతి కూడా పరారైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.