సదర్ సమ్మేళనం అధికారిక పండుగ: యాదవుల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్నామన్న రేవంత్ రెడ్డి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పాటు నిర్వహణ కోసం అయిదు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించామని వివరించారు. గోల్కొండ కోట ఒకనాడు గొల్ల కొండగా ఉండేదని గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికన యాదవులకు దక్కాల్సిన వాటా కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.