ఈథా చిత్రం నుంచి శ్రద్ధా కపూర్ మహారాష్ట్ర సంప్రదాయ పోస్టర్లు విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం ఈథా నుంచి మేకర్స్ సరికొత్త పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె ప్రసిద్ధ లావణి కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్గావ్కర్ పాత్రలో కనిపించనున్నారు. మహారాష్ట్ర సంప్రదాయ నవ్వారి చీర, భారీ ఆభరణాలతో ఉన్న ఆమె రాజసం ఉట్టిపడే లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ నాల్గవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.