తెనాలి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కైవసం చేసుకున్న జనసేన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెనాలి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని జనసేన పార్టీ కైవసం చేసుకున్నట్లు తెలిపారు. తెనాలి చరిత్రలో తొలిసారిగా జనసేన అభ్యర్థి తోటకూర రమణారావు తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారని పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయంతో పట్టణంలో జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నట్లు వెల్లడించారు.