సోషల్ మీడియాలో డబ్బు ప్రదర్శనతో యూట్యూబర్ ఇంట్లో భారీ చోరీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని కన్నియాకుమరి జిల్లాలో యూట్యూబర్ మధుమిత ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆమె తరచూ సోషల్ మీడియాలో డబ్బు కట్టలు, బంగారు నగలు చూపుతూ రీల్స్ చేసి పోస్ట్ చేస్తుండటంతో దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. దంపతులు బయటకు వెళ్లి అర్ధరాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో దాచిన నూటఇరవై సవర్ల బంగారు నగలతో పాటు యాభై వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు.