మచిలీపట్నంలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు
రిపోర్టర్: అశోక్
స్థలం: కృష్ణా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర వెల్లడించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు మూడు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ సెంటర్లో జరుగుతున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించానని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.