నర్సంపేట: చెరువు నీటి తరలింపును అడ్డుకున్న మాదన్నపేట గ్రామస్థులు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట మండలం మాదన్నపేట, నాగూర్లపల్లి గ్రామాల్లోని చెరువు నీటి తరలింపుపై వివాదం చెలరేగింది. పంట పొలాల కోసం తూము తీయడానికి వచ్చిన రైతులను గ్రామస్థులు అడ్డుకున్నారు. చెరువులో ఉన్న నాలుగు అడుగుల నీరు తమ తాగునీటి అవసరాలకు అత్యవసరమని, దానిని తరలిస్తే ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చెరువు కట్టపైకి చేరి నిరసన తెలిపారు.