ఆరోగ్యానికి ముప్పు: కూరగాయలు, ధాన్యాలలో తగ్గుతున్న పోషక విలువలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: లండన్
భూమిపై పండే వివిధ రకాల కూరగాయలు మరియు ధాన్యాలలో పోషక విలువలు భారీగా తగ్గుతున్నాయని యూకే సంస్థ డీప్ సైన్స్ వెంచర్స్ పరిశోధనలో వెల్లడైంది. గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే పంటలలో ఇరవై నుండి యాభై శాతం వరకు పోషకాలు కరవయ్యాయని పరిశోధకులు స్పష్టం చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు నేలల క్షీణత కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.