గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా
రిపోర్టర్: సునీల్
స్థలం: Goa / Telangana
కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మాదిరిగానే భవిష్యత్తులో గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళను తాకిన రుతుపవనాలు గోవాకు చేరినట్లుగానే కాంగ్రెస్ విజయ పరంపర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.