కెప్టెన్గా పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు: సంచలన నిజాలు వెల్లడించిన సచిన్
రిపోర్టర్: రాము
స్థలం: Mumbai
తొంభైల దశకంలో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన సమయంలో తన మాట చెల్లుబాటు కాలేదని, జట్టు ఎంపికలో పూర్తి స్వేచ్ఛ లభించలేదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో అభిమానులతో ముచ్చటించిన ఆయన నాటి చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆ కాలంలో బీసీసీఐ ప్రస్తుత వాతావరణంలా లేదని, నాటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవని సచిన్ తెలిపారు.