వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రోహిత్ కోహ్లీ నిలకడగా రాణించాలన్న ఆకాశ్ చోప్రా

రిపోర్టర్: సతీష్ స్థలం: India

వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నుంచి పరుగులే ప్రధాన అక్ష అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని వీరిద్దరి అనుభవం టీమిండియాకు ఎంతో కీలకమని, వారు నిలకడగా పరుగులు సాధించి మ్యాచ్‌లు గెలిపించాలని ఆయన జియోస్టార్‌తో పేర్కొన్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.