అసాధారణ ప్రతిభతో పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా
రిపోర్టర్: విజయ్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా అరుదైన ఘనత సాధించారు. లాక్డౌన్ సమయంలో కేవలం రెండున్నర నెలల్లోనే అదృశ్యమైన 76 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 14 ఏళ్ల లోపు పిల్లలను రక్షించిన అధికారులకు ఔట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ ఇస్తామన్న పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాత్సవ హామీ మేరకు ఆమెకు పదోన్నతి లభించింది. పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు వెళ్లి మరీ ఆమె పిల్లలను రక్షించడం విశేషం.