ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దిల్లీలో సేవ్ డెమోక్రసీ పేరుతో విపక్ష ఎంపీల భారీ ర్యాలీ కొనసాగుతున్న సమయంలో ఆయన ఎక్స్ వేదికగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చాలు సమయం వచ్చేసిందని, వెంటనే వైదొలగాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ తీవ్ర ప్రకటన వెలువడింది.