నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు, వెలిగొండ ముంపు గ్రామాలు నీటమునిగాయి
రిపోర్టర్: కిరణ్
స్థలం: ప్రకాశం
వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్ జలాశయంలోకి చేరుతున్నాయి. వారం రోజుల్లో 1.75 టీఎంసీల నీరు చేరడంతో ప్రాజెక్టు పరిధిలోని సుంకేసుల, అక్కమ్మ తండా గ్రామాలు నీట మునిగాయి. పశ్చిమ ప్రకాశంలో నీటి కరవు తీరుతుండటంతో రైతులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.