రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలోకి టీడీపీ ఎంపీ సానా సతీష్
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబును చైర్మన్ నామినేట్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఈ కమిటీలో చోటు దక్కడం ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన గౌరవంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇకపై సభలో రాష్ట్ర సమస్యలను, అభివృద్ధి అంశాలను మరింత సమర్థవంతంగా ప్రస్తావించే అవకాశం లభించిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నియామకంపై పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.