రైల్వే కనెక్టివిటీ విస్తరణ: ఒంగోలు–దొనకొండ మార్గంతో పాటు మార్కాపురం ప్రత్యామ్నాయ ప్రతిపాదన

రిపోర్టర్: సతీష్ స్థలం: ఒంగోలు

ఆంధ్రప్రదేశ్లో రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఒంగోలు–దొనకొండ కొత్త రైల్వే లైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి లభించగా, దొనకొండకు బదులుగా మార్కాపురం నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన స్థానిక వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోందని అధికారులు వెల్లడించారు.