జర్నలిస్టులకు రక్షణ చట్టం తెచ్చేలా అసెంబ్లీలో పోరాడుతా: ఎమ్మెల్యే మధుసూదన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జర్నలిస్టులపై దాడులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తరహాలో ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో బలంగా ప్రస్తావిస్తానని ఆయన హామీ ఇచ్చారు. టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రతినిధులు వినతిపత్రం అందజేయగా, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.